ETV Bharat / crime

రాజధానిలో చాప కింద నీరులా 'మత్తు' దందా.. బానిసలైన వారే విక్రేతలుగా.!

Drugs Business in Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది. పబ్‌లు, కళాశాలలకు వ్యాపిస్తూ.. యువకుల జీవితాలు బుగ్గిపాలు చేస్తోంది. మొదట డ్రగ్స్‌కు బానిసలుగా మారినవారే.. తర్వాత విక్రేతలుగా మారుతున్నారు. ఇటీవలే గోవా డ్రగ్స్‌ మత్తుకు ఓ యువకుడు బలయ్యాడు. ఇందులో ప్రధాన నిందితుడు లక్ష్మీపతి.. గంజాయికి అలవాటు పడి సరఫరాదారుడిగా మారాడు. అలాగే మరో కేసులో పట్టుబడ్డ మాన్సి.. ఇంజినీరింగ్‌ వరకు బాగా చదువుకుని మత్తు ఊబిలో చిక్కుకుందని దర్యాప్తులో తెలుస్తోంది.

drugs addiction in hyderabad
హైదరాబాద్​లో డ్రగ్స్​ దందా
author img

By

Published : Apr 3, 2022, 2:15 PM IST

Drugs Business in Hyderabad: హైదరాబాద్‌లో మత్తుపదార్థాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. మత్తు దందా ఆగడం లేదు. అక్రమార్కులు అడ్డదారుల్లో డ్రగ్స్‌ను నగరానికి చేరుస్తూనే ఉన్నారు. గోవా, ఒడిశా, విశాఖపట్నం, ముంబయి, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి మాదకద్రవ్యాలు హైదరాబాద్‌కు చేరుతున్నాయి. ఎల్​ఎస్​డీ, కొకైన్‌, గంజా, ఓపియం వంటి డ్రగ్స్‌.. పబ్బులు, ఇతర ఏజెంట్ల ద్వారా వినియోగదారులకు అందుతున్నాయి. మత్తుకు బానిసలుగా మారిన వారే.. తర్వాత సంపాదన కోసం విక్రేతలుగా మారుతున్నారు.

లక్ష్మీపతి కోసం గాలింపు: ఇటీవల గోవా మత్తులో బీటెక్‌ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం.. విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెట్టింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు లక్ష్మీపతి కోసం ఇంకా గాలింపు కొనసాగిస్తున్నారు. నిన్న మరో రెండు ముఠాలు చిక్కాయి. ఇందులో మాన్సి అనే యువతిని నిందితురాలిగా గుర్తించారు. లక్ష్మీపతి, మాన్సి గతంలో మత్తుకు అలవాటు పడి.. తర్వాత దందాలోకి దిగారని పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది.

కమీషన్​ కోసం దందా: గంజాయి, హాష్‌ ఆయిల్‌ విక్రయిస్తున్న లక్ష్మీపతి.. ఓ పోలీస్‌ అధికారి కుమారుడు. స్నాప్‌చాట్, టెలీగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా దందా సాగిస్తున్నాడు. ఇంజినీరింగ్‌ మధ్యలో వదిలేసిన లక్ష్మీపతి.. ఏడేళ్ల క్రితం గంజాయికి అలవాటుపడ్డాడు. మత్తు కొనేందుకు డబ్బులేని సమయంలో.. ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తే కమీషన్‌ ఇస్తానని చెప్పడంతో దందాలోకి దిగాడు. ఆ తర్వాత తానే విక్రయిస్తే లక్షల్లో సంపాదిచుకోవచ్చని... ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించడం మొదలుపెట్టాడు. హాష్‌ ఆయిల్‌ తయారు చేసి లీటర్‌ 8లక్షల చొప్పున విక్రయిస్తూ ఈ దందాలో కూరుకుపోయాడు. ఇప్పటికే రెండుసార్లు అరెస్టైన లక్ష్మీపతి.. బెయిల్‌పై బయటికొచ్చి విద్యార్థులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు నషా ఎక్కిస్తున్నాడు.

ఉద్యోగం చేస్తూ మత్తుకు బానిసై: నాగపూర్‌లో స్థిరపడిన తెలుగుకుటుంబానికి చెందిన కొండపనేని మాన్సి.. ఇంజినీరింగ్‌ పూర్తిచేసేంత వరకూ మంచి విద్యార్థినియే. ఆరేళ్ల క్రితం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు సమీపంలోని నాచారంలో ఓ వసతి గృహంలో చేరింది. ఓ యువకుడి ద్వారా ఎల్​ఎస్​డీ, గంజాయికి అలవాటుపడిన యువతి.. రెండు, మూడు నెలల్లో పూర్తిగా మత్తుకు బానిసైంది. ఆ తర్వాత వసతిగృహం నుంచి బయటకు వచ్చి యువకుడితోనే కలిసి ఉండేది. నాలుగేళ్ల క్రితం అతడిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో.. గంజాయి కోసం ఒకసారి వైజాగ్‌కు వెళ్లింది. సహచరులు తమకు కూడా కావాలనడంతో.. వ్యాపారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో మదన్‌ మనేకర్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి మూడేళ్లుగా గంజా దందా సాగిస్తున్నారు.

ఇదీ చదవండి: పబ్​పై పోలీసుల దాడులు.. అదుపులో ప్రముఖ సింగర్​, నటులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.