ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేట పాలపాడు రోడ్డులో దారుణం జరిగింది. డిగ్రీ చదువుతోన్న అనూష(19) అనే విద్యార్థినిని దుండగుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోవిందపురం మేజర్ కాలువలో పడేశాడు. మృతురాలు ముప్పాళ్ల మండలం గోళ్లపాలెం వాసిగా గుర్తించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి బయటికి తీసుకొచ్చిన బంధువులు.. పల్నాడు బస్టాండ్ వద్ద విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు. మరోవైపు యువతి మృతిపై నరసరావుపేట గ్రామీణ పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: హైదరాబాద్లో కిలాడీ లేడీ.. పెళ్లి పేరుతో రూ.11కోట్లు లూటీ