హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మియాపూర్ నుంచి జేఎన్టీయూ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వైద్య విద్యార్థిని ఇసుక లారీ ఢీకొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
రాత్రి మియాపూర్లో సినిమా చూసి వస్తుండగా... మెట్రో పిల్లరు 660 దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు కడప జిల్లా బద్వెల్కు చెందిన ఆదిరష్మిగా గుర్తించారు. ఆమె హైదరాబాద్లోని ఓ కళాశాలలో దంత వైద్య విద్య చదువుతోంది.
ఇవీచూడండి: ఇంటి నుంచి పని... ఇంకెన్నాళ్లని..!