వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళకు దిగారు. నాలుగు రోజుల క్రితం మల్లాపూర్ మండలం సిరిపూర్కి చెందిన గంగరాజం అనే వ్యక్తికి హెర్నియా ఆపరేషన్ చేశారని బాధితులు పేర్కొన్నారు. రెండు రోజుల తర్వాత అనారోగ్య సమస్యలు రావడం వల్ల కరీంనగర్‌కు తీసుకెళ్లాలని చెప్పారని పేర్కొన్నారు.
కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో గంగరాజం మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సర్దిజెప్పి సమస్యను పరిష్కరించారు.
ఇదీ చదవండి: కలప దొంగలతో ఉన్న ఆ నలుగురు ఎవరు..?