నీటి గుంతలో పడి ఓ రైతు కూలీ మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకుంది.
నీళ్లు పెట్టడానికి వెళ్లి..
నిజామాబాద్ మండలం కేంద్రలోని శ్రీనగర్‌కు చెందిన నరసింహులు అదే ప్రాంతానికి చెందిన పెంటయ్య వద్ద రైతు కూలీగా పని చేస్తున్నాడు. ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందినట్లు నిజామాబాద్ రూరల్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:లాభాల పంట పండిస్తోన్న ఆర్టీసీ కార్గో సేవలు