SBI Call Center: బ్యాంక్ అధికారులమని.. అమాయకులకు ఫోన్లు చేసి.. వారి ఖాతాల నుంచి డబ్బును తస్కరిస్తున్న ముఠాను సైబర్‌బాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్‌సెంటర్‌ను దిల్లీలో గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్న ముఠాను సైబర్‌బాద్ పోలీసులు పట్టుకున్నారు.
ఎస్‌బీఐ పేరుతో తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ ముఠా సభ్యులు కోట్లు కొల్లగొట్టారు. ప్రజలను నకిలీ కాల్‌సెంటర్‌తో మోసం చేస్తున్న 14 మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్‌సెంటర్‌కు చెందిన వారి ఖాతాల్లోని నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా సభ్యులు దేశవ్యాప్తంగా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు. ఎస్‌బీఐ కేవైసీ, క్రెడిట్ కార్డుల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు.
నకిలీ కాల్‌సెంటర్‌పై సమాచారం అందుకున్న పోలీసులు 'ధని లోన్ బజార్' కాల్‌సెంటర్‌పై దాడులు చేశారు. దిల్లీ కేంద్రంగా నడుస్తున్న 'ధని లోన్ బజార్' కాల్‌సెంటర్‌పై దాడి చేసి 14 మందిని అరెస్టు చేశారు. నిందితులు మొత్తం 27 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.