ETV Bharat / crime

కౌన్‌బనేగా కరోడ్‌పతి పేరుతో ఎస్‌ఎంఎస్‌.. సొమ్మంతా మటాష్‌ - కౌన్‌బనేగా కరోడ్‌పతి పేరుతో సైబర్ నేరం

Kaun Banega Crorepati fraud in Hyderabad: సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజూ ఏదో ఓ మూల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జనం మోసపోతూనే ఉన్నారు. ఇదివరకు ఉద్యోగాలు, బహుమతి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అంటూ సందేశాలు పంపి డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు కౌన్​ బనేగా కరోడ్​పతి కార్యక్రమం పేరు చెప్పి జేబులు గుళ్ల చేస్తున్నారు.

Kaun Banega Crorepati
Kaun Banega Crorepati
author img

By

Published : Dec 13, 2022, 11:20 AM IST

Kaun Banega Crorepati fraud in Hyderabad: కౌన్‌బనేగా కరోడ్‌పతిలో రూ.1.50 కోట్లు గెలుచుకున్నారంటూ పాతబస్తీవాసి చరవాణికి సందేశం వచ్చింది. అక్కడిచ్చిన వాట్సాప్‌ నంబరులో మాట్లాడుతూ రెండేళ్లుగా రూ.60 లక్షలు చెల్లించాడు. ఆలస్యంగా మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా సామాన్యులే కాదు.. సైబర్‌ మోసగాళ్ల బాధితుల్లో ఐటీనిపుణులు, గృహిణులు, వృద్ధులు ఉంటున్నారు.

కొందరు తెలిసీ ఏమరుపాటులో మోసపోతున్నారు. అధిక శాతం వాట్సాప్‌/ఫోన్‌కాల్‌/ఎస్‌ఎంఎస్‌ల ద్వారా స్పందించినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. మోసాల నివారణకు విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, షాపింగ్‌మాల్స్‌, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఏయే అంశాల్లో..

* క్రెడిట్‌/డెబిట్‌ కార్డులు: పాన్‌ లింకేజ్‌, కేవైసీ అప్‌డేట్‌, కార్డుబ్లాక్‌, రీప్లేస్‌మెంట్‌, రివార్డు పాయింట్లు.

* నకిలీ కస్టమర్‌కేర్‌ సెంటర్లు: గూగుల్‌, జస్ట్‌డయల్‌, ఫేస్‌బుక్‌

* ఆదాయపన్ను: ఎస్‌ఎంఎస్‌, విషింగ్‌(ఫోన్‌కాల్స్‌)

* డబ్బు: రుణాలు, లాటరీలు, బీమా, డేటింగ్‌/ఫిమేల్‌ ఎస్కార్ట్‌, సెల్‌టవర్‌ ఏర్పాటు, మొబైల్‌ ఫ్యాన్సీ నంబర్లు.

.

ఆ సందేశాలకు స్పందించవద్దు:

'ఎలాంటి పత్రాల్లేకుండా తక్షణమే అప్పు ఇస్తామన్నా, వెంటనే విద్యుత్తు బిల్లు చెల్లించకుంటే అర్ధరాత్రి సరఫరా నిలిపివేస్తామని బెదిరింపు ఎస్‌ఎంఎస్‌/ఫోన్‌కాల్‌లు వచ్చినా నమ్మొద్దు. ఇంట్లో ఉంటూ రోజూ రూ.3000-4000 సంపాదించవచ్చని చెప్పినా, రూ.200తో టాస్క్‌లిచ్చి రూ.400 లాభం చేతికిచ్చినా పెట్టుబడులు పెట్టొద్దు. మోసపోయినట్టు గుర్తించగానే 1930 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయండి.'-కె.వి.ఎం.ప్రసాద్‌, ఏసీపీ, నగర సైబర్‌క్రైమ్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.