ETV Bharat / crime

CYBER CRIME: 'అధిక ఆదాయం ఆశచూపి.. నిండా ముంచేశారు'

Cyber crime Under Love Life and Natural Healthcare organization: మనిషి బలహీనతను బలంగా మార్చుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చని నమ్మిస్తూ.. నిండా ముంచుతున్నారు. అలాంటి కేటుగాళ్లు సృష్టించిన సంస్థే లవ్‌ లైఫ్‌ అండ్‌ నేచురల్‌ హెల్త్‌ కేర్‌. వైద్య పరికరాలపై పెట్టుబడి పెడితే అద్దె రూపంలో అధిక ఆదాయం వస్తోందంటూ వేలాది మందిని బురిడీ కొట్టించారు.

CYBER CRIME in vijayawada
వైద్య పరికరాలపై పెట్టుబడి పేరుతో ఘరానా మోసం
author img

By

Published : Dec 26, 2021, 3:31 PM IST

వైద్య పరికరాలపై పెట్టుబడి పేరుతో ఘరానా మోసం

Massive fraud under medical equipment rental business: వైద్య పరికరాల అద్దె వ్యాపారం పేరిట లవ్ అండ్‌ లైఫ్ న్యాచురల్ అండ్ హెల్త్ కేర్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. మెుదట యాప్‌ ప్రారంభించిన నిర్వాహకులు, తర్వాత వెబ్‌సైట్‌ రూపొందించారు. ఇందులో ఉండే వైద్య పరికరాలపై పెట్టుబడి పెడితే.. రోజూ వారీగా డబ్బు వస్తోందని బాధితులను నమ్మించారు. గొలుసు కట్టు విధానంలో ఒక్కొక్కరు రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు. ఇలా నెల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన బాధితులు మోసపోయారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడకు చెందిన భార్యభర్తలు లక్ష్మణ్, ఎస్తెర్ రూ.2 లక్షల 30 వేలు సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నారు.

Cyber crime under Healthcare organization: కేవలం 800 రూపాయలతో పరికరం కొంటే.. మేమే కావాల్సిన వారికి అద్దెకు ఇస్తాం.. రోజుకు 42 రూపాయల చొప్పున 2 నెలలు డబ్బులు చెల్లిస్తామని చెప్పే సరికి ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. 20 రోజులకే అసలు మెుత్తం తిరిగి రావడంతో అప్పు చేసి మరీ లక్షలు పెట్టారు. హఠాత్తుగా సదరు సంస్థ డబ్బు చెల్లించడం నిలిపివేయడంతో లబోదిబోమంటున్నారు. ఈ సంస్థను నమ్మి మోసపోయిన వారు ఒక్క విజయవాడలోనే వందలాది మంది ఉన్నట్లు తెలుస్తోంది.

fraud with Love Life and Natural Healthcare: వీఐపీ యాప్‌ అని మరొకటి సృష్టించిన నిందితులు.. రూ.14,980లు పెట్టుబడి పెడితే 2 గంటల్లోనే అద్దె డబ్బులు చెల్లిస్తామని ప్రకటించారు. ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి ఇందులో 25 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. వందలాది మంది కోట్ల రూపాయలు ఇలా కోల్పోయారు. మోసంపై కొంత మంది సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించగా వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.