ఆన్లైన్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అమ్ముతానని ఒకరు, చేతి గ్లౌజులు విక్రయిస్తానని మరొకరు దాదాపు రూ. 4 లక్షలు దోచుకున్నారు. దిల్లీకి చెందిన బలరాం కుమార్ ఝా.. తాను ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు విక్రయిస్తానంటూ ఆన్లైన్లో పోస్టు పెట్టాడు. హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన సిద్దార్థ తనకు.. రెండు కాన్సంట్రేటర్లు కావాలంటూ బలరాంను సంప్రదించాడు. ఖాతాలోకి నగదు బదిలీ చేస్తే.. సరుకు పంపుతానని బాధితుడిని నేరస్థుడు నమ్మించాడు. నమ్మిన సిద్దార్థ అతని ఖాతాలోకి రూ. 2లక్షల 85వేలు బదిలీ చేశాడు. నగదు అందిన తర్వాత బలరాం స్పందించకపోవడంతో.. మోసపోయానని గ్రహించిన బాధితుడు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరో కేసులో రెండు నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌కు చెందిన జావీద్ ఖాన్.. చేతి గ్లౌజులు విక్రయిస్తానంటూ ఓ ఆన్లైన్ మార్ట్‌లో పోస్టు పెట్టాడు. నగరానికి చెందిన కపిల్ జైన్.. తనకు రూ. లక్ష విలువచేసే గ్లౌజులు కావాలంటూ జావీద్‌ను సంప్రదించాడు. రూ. లక్ష ఖాతాలోకి జమ చేస్తే గ్లౌజులు డెలివరీ చేస్తానని నమ్మించిన జావీద్.. నగదు ఖాతాలోకి బదిలీ కాగానే స్పందిచడం మానేశాడు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇరు సంఘటనల్లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 7న దిల్లీలో బలరాంను, 5న యూపీలో జావిద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇరు కేసుల్లో సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ తరలించి రిమాండ్‌కు పంపించారు.
ఇదీ చదవండి: THEFT : దొంగతనం చేయడంలో వీళ్ల స్టైలే వేరప్ప!