ETV Bharat / crime

వాట్సాప్​ వీడియో కాల్​ లిఫ్ట్​ చేశారు.. ఆ కాసేపటి కంగుతిన్నారు.! - whats app video call

Video Call morphing and cheating: సామాజిక మాధ్యమాల వేదికగా అపరిచిత స్నేహాలు గొంతు మీద కత్తిలా మారాయి. మొదట సౌమ్యంగా మాట్లాడి వారు అనుకున్నది సాధించాక ఇక అసలు స్వరూపం బయటపెడుతున్నారు. కొత్తగా వాట్సాప్​ వీడియో కాల్స్​ ద్వారా సైతం సైబర్​ నేరగాళ్లు మోసగాళ్లకు పాల్పడుతున్నారు. వీడియో మార్ఫింగ్​లకు పాల్పడి బాధితులను బెదిరింపులకు గురిచేసి అందినకాడికి దోచుకుంటున్నారు. సినీ పరిశ్రమలో ఉన్న వారు సైతం వీరిలో ఉచ్చులో చిక్కుకుంటున్నారు. నగరంలో ఇటీవల వెలుగు చూసిన రెండు ఘటనలు దీనికి దృష్టాంతం.

cheating via whatsapp video call
వాట్సప్​ వీడియో కాల్​ చేసి చీటింగ్​
author img

By

Published : Apr 22, 2022, 10:50 AM IST

Updated : Apr 22, 2022, 11:44 AM IST

Video Call morphing and cheating: నగరంలో సైబర్​ నేరాలకు అడ్డుకట్ట వేయడం కష్టతరంగా మారింది. నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను అనుసరిస్తూ అమాయకులను నిలువుదోపిడీ చేస్తున్నారు. అప్రమత్తమై తప్పించుకున్నామా ఆ ఉచ్చు నుంచి బయటపడినట్లే.. పొరపాటున వారి చేతికి చిక్కామో ఇక ఉన్నది మొత్తం ఊడ్చేవరకూ వదిలిపెట్టరు. వారి బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే ఈ సమస్య నుంచి బయటపడతారు. కానీ ఎక్కడ పరువు పోతుందనో భయంతో వెనకడుగు వేస్తున్నారు. వారు అడిగినంతా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇక వల్ల కాదని తెలిసి చివరికి పోలీసులను సంప్రదిస్తున్నారు.

వీడియో మార్ఫింగ్​: సంగీత దర్శకుడి చరవాణికి వీడియో పంపి, అనంతరం అతని ముఖాన్ని మరొకరి ముఖంతో మార్ఫింగ్‌ చేసి డబ్బుల కోసం వేధిస్తున్న ఘటన ఇది. హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణానగర్‌లో నివసించే సంగీతదర్శకుడు సరోలి రాజీవ్‌ ఎబ్నేజర్‌కు గతేడాది అక్టోబరు 22న ఫేస్‌బుక్‌ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి పరిచయమై ఫోన్‌ నంబరు తీసుకున్నాడు. అనంతరం సరోలికి ఓ వీడియోకాల్‌ వచ్చింది, అందులో నగ్నంగా ఓ మహిళ ప్రత్యక్షమైంది. అనంతరం అవతలి వ్యక్తి మరొకరి శరీరానికి సరోలి ముఖాన్ని మార్ఫింగ్‌ చేసి, ఫేస్‌బుక్‌ను హ్యాక్‌ చేశాడు. ఆ వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరించి డబ్బు డిమాండ్‌ చేశాడు. సరోలి కొంత మొత్తం చెల్లించినా బెదిరింపులు ఆగకపోవడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరో చోట: అపరిచితులు చేసిన వీడియో కాల్‌కు స్పందించడమే ఆ యువకుడిని మానసిక వేదనకు గురిచేసింది. ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం అమీర్​పేట్​లోని ఎల్లారెడ్డిగూడలోని జయప్రకాష్‌నగర్‌కు చెందిన వేమూరి కిరణ్‌(29)కు మంగళవారం వాట్సప్‌ వీడియో కాల్‌ రాగా స్పందించాడు. కాసేపటి తరువాత కాల్‌ కట్​ అయింది. అగంతకులు కిరణ్‌ వీడియో మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా చిత్రీకరించారు. తిరిగి ఫోన్‌ చేసి డబ్బులివ్వకుంటే.. ఆ చిత్రాలు సామాజిక మాధ్యమాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించారు. దీంతో బాధితుడు రూ.47వేలు ఫోన్‌పే చేశాడు. మళ్లీ బెదిరిస్తుండటంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవీ చదవండి: కుమార్తె మాట వినడం లేదని తల్లి ఆత్మహత్య

షరతుల్లేకుండా కాంగ్రెస్​లోకి ప్రశాంత్​ కిశోర్​- జగన్​తో పొత్తుకు వ్యూహం!

Last Updated : Apr 22, 2022, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.