దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ప్రయాణికులను హైదరాబాద్ రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మిక్సర్ గ్రైండర్, కట్టింగ్ ఉపకరణాల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు.
![gold and foreign currency seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11221515_nl-2.jpg)
సుమారు రెండున్నర కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విలువ సుమారు రూ.1.15 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేశారు.
![gold and foreign currency seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11221515_nl-3.jpg)
వీటితో పాటు ఓ వ్యక్తి దుబాయ్‌కి డాలర్లను తరలిస్తుండగా సీఐఎస్ఎఫ్ సహకారంతో గుర్తించి.. నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఓ ప్రయాణికుడు సుమారు రూ.30 వేల యూఎస్ డాలర్లను తీసుకుని దుబాయ్‌కి బయలుదేరాడు. తనిఖీల్లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.21.48 లక్షలకు సమానంగా ఉంటుందని వివరించారు.
![gold and foreign currency seized](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11221515_nl-1.jpg)
ఇదీ చూడండి: షార్ట్ సర్క్యూట్‌తో టైర్ల దుకాణంలో అగ్నిప్రమాదం