ETV Bharat / crime

కదులుతున్న బస్సు కిందపడి కొవిడ్​ బాధితుడు బలవన్మరణం - తెలంగాణ తాజా వార్తలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్​ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్​ వద్ద దారుణం జరిగింది. కొవిడ్​ బాదితుడు బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

peddapalli
covid patient suicide
author img

By

Published : May 2, 2021, 3:14 PM IST

ప్రాణాంతక వైరస్​ సోకింది... ప్రాణం నిలుస్తుందన్న గ్యారంటీ లేదు. బతికుండి అయినోళ్లకు భారం కాకూడదు. ఆరోగ్యం విషమించి ఉక్కిరిబిక్కిరై ఊపిరొదలకూడదు. ఇలా కకావికలమైన మనసుకు అపోహలు తోడై..... మనసులో రేగిన కల్లోలం కొవిడ్​ బాధితుడిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. సిగ్నల్​ పడగా కదులుతున్న బస్సు చక్రంకింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సూర్యనగర్​కు చెందిన కాంపెల్లి శ్రీనివాస్​ గోదావరిఖని మున్సిపల్​ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్​ వద్ద ఆర్టీసీ బస్సుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సిగ్నల్​ వద్ద ఆగిఉన్న బస్సు వెనుక చక్రం వద్ద నిలబడిన శ్రీనివాస్​ సిగ్నల్​ పడగానే చక్రం కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాస్​కు కొవిడ్​ పాజిటివ్​ వచ్చిందని... ఆరోగ్యం విషమించి తాను బతకడం కష్టమనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధరించామని పోలీసులు తెలిపారు. మున్సిపల్​ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి: బతికుండగానే మోసుకెళ్లాల్సిన పరిస్థితి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.