couple died in vishaka: అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ భర్త. ఆమెను చంపేశాక పోలీసులకు ఎలాగూ దొరుకుతాను.. శిక్ష తప్పదని భావించాడో ఏమో.. తానూ ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఏపీలోని విశాఖపట్టణం జిల్లా శ్రీ హరి పురం పరిధిలోని గొల్లలపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
డంబెల్‌తో కొట్టి
శివనాగేశ్వర రావు, మాధవి భార్యాభర్తలు. ఇటీవల మాధవిపై శివనాగేశ్వర రావుకు అనుమానం కలగడంతో.. ఇద్దరి మధ్య తరచూ గొడవలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ఆమెను ఇనుప డంబెల్‌తో కొట్టి హత్య చేశాడు. అనంతరం తానూ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: Groom missing: రెండ్రోజుల్లో పెళ్లి.. వరుడు అదృశ్యం.. అసలేం జరిగిందంటే..?