Couple suicide in Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్ పూర్‌లో విషాదం నెలకొంది. భర్తతో గొడవ పడిన భార్య వ్యవసాయ క్షేత్రంలోని బావిలో దూకింది. వెంటనే ఆమెను కాపాడేందుకు దిగిన భర్త వెంకటి కూడా నీటిలో గల్లంతయ్యారు. అక్కడే ఉన్న వెంకటి తల్లి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
మృతిచెందిన దంపతులకు తొమ్మిదేళ్ల గీతాంజలి, ఏడేళ్ల మల్లీశ్వరితో పాటు నాలుగేళ్ల బాబు ఉన్నాడు. దంపతుల మరణంతో ముగ్గురు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. ఆ పిల్లలకు కనీసం వారికి వారి తల్లిదండ్రులు ఏమయ్యారో తెలియక అమాయకపు చూపులు చూస్తుండటం చూసి అక్కడున్న వారు కంటతడి పెట్టారు.
![తల్లిదండ్రులు మరణించడంతో ఆనాథలైన పిల్లలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17243031_thalli.jpg)
ఇవీ చదవండి: