ETV Bharat / crime

కుటుంబం సజీవదహనం... పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య! - gas leakage news

gas leak 3 members died
ఇంట్లో గ్యాస్ లీక్
author img

By

Published : Jan 3, 2022, 8:18 AM IST

Updated : Jan 3, 2022, 3:32 PM IST

08:13 January 03

కుటుంబం సజీవదహనం... పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య!

కుటుంబం సజీవదహనం...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచలో విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్‌ పోసుకుని ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో దంపతులు సహా వారి కుమార్తె సజీవదహనం అయ్యారు. మరో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబం సజీవదహనం ఆత్మహత్యేనని పోలీసులు తేల్చారు. ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ దొరికిందని వెల్లడించారు. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏసీపీ రోహిత్‌ రాజ్‌ తెలిపారు. దంపతులు సహా కుమార్తె సాహిత్య మృతిచెందారని వివరించారు. మరో కుమార్తె సాహితి... పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నామని తెలిపారు.

తూర్పుబజార్‌లో నివాసముంటున్న రామకృష్ణ... పాల్వంచలో మీ సేవా కేంద్రాన్ని నడిపారు. ఇటీవల ఇతరులకు లీజుకు ఇచ్చారు. అనంతరం రాజమహేంద్రవరానికి వెళ్లి రెండ్రోజుల క్రితం తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఇంట్లో సజీవదహనం అయ్యి కనిపించడం పలు అనుమాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. రామకృష్ణ కారులో పలు పత్రాలు, బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో సూసైడ్‌ నోట్‌ దొరకడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు.

ఇదీ చూడండి: Hair Growth Tips: ఇవి తింటే మీ జుట్టు రాలిపోదు!

Last Updated : Jan 3, 2022, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.