ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్లో దాచిన మద్యం దుకాణాల నగదును చోరీ చేసిన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
వీరవాసరం పోలీస్‌స్టేషన్‌కి చెందిన కానిస్టేబుళ్లు గంగాజలం, గణేశ్వరరావులను విధుల నుంచి తొలగించారు. పోలీస్‌స్టేషన్‌లో దాచిన మద్యం దుకాణాల సొమ్ము చోరీకి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ఠాణా ఎస్ఐ రామచంద్రరావు, ఏఎస్ఐ ఎం.మోహనరావులను వీఆర్‌కు పంపారు.
ఇవీచూడండి: ఆర్టీసీ బస్సులో 14.8 కిలోల పుత్తడి పట్టివేత