ETV Bharat / crime

Accident: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి - రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

శనివారం తెల్లవారు జామున ఓ కానిస్టేబుల్(constable) బైక్​పై​ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మరో ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్​ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన హైదరాాబాద్ మలక్​పేటలో చోటుచేసుకుంది.

constable died in road accident
constable died in road accident
author img

By

Published : Jun 5, 2021, 4:10 PM IST

హైదరాబాద్​ మలక్​పేటలో రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి (constable died)చెందాడు. రాంనగర్​ ప్రాంతానికి చెందిన ప్రణీత్​ కుమార్​(2020 బ్యాచ్​) నార్త్​ జోన్​ డీసీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్​గా విధులు నిర్వహిస్తున్నారు.

ఈరోజు తెల్లవారు జామున మూసారాం బాగ్​ ప్రాంతంలో ఉండే మిత్రుడిని కలిసేందుకు బైక్​పై వచ్చే క్రమంలో.. మరో ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈఘటనలో కానిస్టేబుల్​కు తీవ్రగాయాలయ్యాయి. దీనితో తీవ్ర రక్తస్రావం అయ్యి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. మరో వాహనదారుడికి గాయాలు కావడంతో.. వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.