congress leaders darna in bodhan: బోధన్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీకాంత్ విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించిన బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్, బోధన్ పట్టణ రూరల్ ఏఎస్ఐ రవీందర్‌ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ నాయకులు ధర్నా చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. విద్యార్థి సంఘాల పిలుపు మేరకు పట్టణంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బోధన్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అసలు ఏమి జరిగిందంటే: జిల్లాలోని ఖండ్‌గావ్‌కి చెందిన డిగ్రీ విద్యార్ధి శ్రీకాంత్ మూడు నెలల క్రితం కనిపించకుండాపోయాడు. నిన్న అతని మృతదేహం లభించింది. శ్రీకాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అదే కళాశాలలోనే చదివే అమ్మాయి, శ్రీకాంత్ ప్రేమించుకున్నారని.. ఆ యువతి కుటుంబసభ్యులే చంపారని వారు ఆరోపించారు.
ఇవీ చదవండి :