మహబుబాబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్నకిష్టాపురం శివారు సర్వాం తండాలో కోర్టు కేసులో ఉన్న భూమి విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవలో ఒకరు తీవ్రంగా గాయపడగా.. మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఇరువురి ఫిర్యాదుతో ఇరు కుటుంబాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇదీ గొడవ
తండా శివారులో ఉన్న ఎకరం భూమి విషయంలో మాలోత్ బాలాజీ, మాలోత్ అజయ్ కుటుంబాల మధ్య గత కొంతకాలంగా తగాదా ఉంది. ఇరువురూ కోర్టును ఆశ్రయించారు. జులై 9 వరకు ఆ భూమిలోకి ఎవ్వరూ వెళ్లొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి అజయ్ కుటుంబ సభ్యులు భూమిలోకి ప్రవేశించి చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలాజీ అక్కడికి వెళ్లి భూమిలోకి ఎందుకెళ్లారని ప్రశ్నించాడు. మాటా మాటా పెరిగి ఇరుకుటుంబ సభ్యులు దాడి చేసుకున్నారు.
గొడ్డలితో అజయ్... బాలాజీపై దాడి చేశాడు. దాడిలో బాలాజీ తీవ్రంగా గాయపడ్డాడు. ఇరు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని బాలాజీ విజ్ఞప్తి చేస్తున్నాడు.
ఇదీ చూడండి: Suiside: ఆర్థిక సమస్యలతో ఆ తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి..