9 labourers stuck in Godavari river: భారీ వర్షాల కారణంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు సమీపంలోని కుర్రు గ్రామంలో చిక్కుకున్నారు. మూడు రోజుల క్రితం పొలం పనుల కోసం గోదావరి నదిపై నిర్మించిన బోర్నపల్లి వంతెన అవతల ఉన్న కుర్రు గ్రామానికి వెళ్లారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో అక్కడే ఉండి పోయారు. దీంతో వారి కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్... కూలీలను రక్షించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కూలీలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను పంపారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం... వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. కానీ గోదావరిలో చిక్కుకున్న 9 మంది కూలీల వార్త కవరేజ్‌కు వెళ్లిన విలేకరి గల్లంతయ్యారు.
ఇదీ చూడండి: 'బీ కేర్‌ఫుల్.. డెంగీ డేంజర్ బెల్స్ మోగాయ్'