ETV Bharat / crime

Chain Snatching: 'ఈజీగా కొట్టేద్దామనుకున్నారు... కానీ కొట్టించుకున్నారు' - తెలంగాణ వార్తలు

Chain Snatching: ఇద్దరు దుండగులు చైన్ స్నాచింగ్‌ చేద్దామనుకున్నారు. అందుకు ఓ వృద్ధురాలిని టార్గెట్‌ చేశారు. ఆమె నుంచి పుస్తెలతాడును లాక్కుని పారిపోయేందుకు రెడీ అయ్యారు. ఇంతలో కథ అడ్డం తిరిగింది. ఓ వ్యక్తి వీరి బైక్‌ను అడ్డగించి తన్నడంతో కిందపడ్డారు. స్థానిక రైతులతో చితకబాదించుకున్నారు.

Chain
Chain
author img

By

Published : Jan 6, 2022, 3:48 PM IST

Chain Snatching: పొలం పనులకు వెళుతున్న వృద్ధురాలి మెడలో పుస్తెలతాడును దొంగిలించి పారిపోతున్న దుండగులను పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. కోడెర్ మండలం తీగలపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ, సుల్తానమ్మ పనుల కోసం పొలం దగ్గరకు వెళుతున్నారు. మార్గమధ్యలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వీరిని అడ్డగించి కత్తులతో బెదిరించారు. ఎల్లమ్మ మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కొని బైక్‌పై పారిపోయేందుకు యత్నించారు. వృద్ధురాలి కేకలు వేయగా అటునుంచి వెళ్తున్న యాదగిరి... దుండగులను గమనించాడు. వారిని ఆపేందుకు యత్నించగా... కత్తితో దాడి చేసేందుకు యత్నించగా... యాదగిరి వారి బైక్‌ను కాలితో తన్నాడు.

వెంటనే చుట్టు పక్కల పనిచేస్తున్న రైతులు అక్కడికి చేరుకుని దుండగులను చితకబాదారు. ఇద్దరు దొంగలు విడిపించుకునే క్రమంలో రైతు గంగయ్యపై రాయితో దాడి చేయగా... గాయాలయ్యాయి. కోపోద్రిక్తులైన రైతులు... నిందితులను చితకబాదడం వల్ల ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ముగ్గురిని జిల్లా ఆస్పతికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నేను పొలం పనులకు వెళ్తుండగా... ఇద్దరు వ్యక్తులు నా మెడలోని పుస్తెలతాడును లాక్కుని బైక్‌పై పారిపోతున్నారు. నేను కేకలు వేయగా.. యాదగిరి అనే వ్యక్తి వారి బండిని నిలువరించాడు. అనంతరం చుట్టుపక్కల రైతులు దుండగులకు దేహశుద్ధి చేశారు.

-- ఎల్లమ్మ, బాధితురాలు

'ఈజీగా కొట్టేద్దామనుకున్నారు... కానీ కొట్టించుకున్నారు'

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.