సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగిన సెల్ఫోన్ల దొంగతనం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ. 15 లక్షల విలువైన చరవాణీలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
శుక్రవారం రాత్రి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్టోర్ తాళం తొలగించి లోపలికి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పక్కా ప్రణాళికతో లోపలికి ప్రవేశించిన దుండగులు పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.15 లక్షల విలువైన చరవాణీలు చోరీకీ గురయ్యాయని చెప్పారు. ఈ ఉదయాన్నే మొబైల్ స్టోర్‌కి వెళ్లిన యజమాని.. దొంగతనం జరిగిందన్న విషయాన్ని గమనించారు. వెంటనే కార్ఖానా పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మరోసారి సీసీఎస్ పోలీసుల కస్టడీకి కార్వీ ఛైర్మన్ పార్థసారథి