Theft in Petrolbunk CC footage : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గా శివారులోని ఓ పెట్రోల్ బంక్‌లో గుర్తు తెలియని వ్యక్తి రూ.లక్ష 20 వేల నగదు చోరీ చేశాడు. రావిపహాడ్‌కు చెందిన కాటా కోటిరెడ్డి రెండేళ్లుగా శ్రీ లక్ష్మీసాయి పెట్రోల్ బంక్‌ను నడిపిస్తున్నారు. శనివారం రోజు బ్యాంకు సెలవు కావడంతో పెట్రోల్, డీజిల్ అమ్మగా వచ్చిన డబ్బులు బంక్‌లోనే ఉంచారు. దీంతో ఆదివారం ఓ దుండగుడు బైక్‌పై వచ్చి షట్టర్‌లోకి చొరబడి నగదును అపహరించాడు. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న సిబ్బంది నిద్రపోయారని బంక్ యజమాని కోటిరెడ్డి తెలిపారు. పోలీసులకు సమాచారం అందించామన్నారు.