నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని విక్రయిస్తున్న ఘరానా మోసగాళ్లను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ముద్రణలు స్టాంపు పేపర్లను సృష్టించి.. వందల కోట్ల భూమికి ఎసరుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
వీరి మోసాలపై మిహిరా బిల్డ్ కన్స్ట్రక్షన్స్, హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ కేటుగాళ్లు గతంలో నకిలీ పత్రాలు చూపించి.. బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 12లో 9 ఎకరాల 17 గుంటల అత్యంత ఖరీదైన భూమిని విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ వ్యవహారం నడిపేందుకు సీసీఎల్ఏ నుంచి జీహెచ్ఎంసీ అధికారుల ముద్రణలు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన తిరుమల రామచందర్ రావు, దర్పల్లి సంపత్‌లను పోలీసులు అరెస్ట్ చేసి.. కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: రసాయనాలు మీదపడి ఆరుగురికి తీవ్ర గాయాలు