ETV Bharat / crime

పొదుపు మహిళల ఖాతాల్లో సొమ్ము స్వాహా.. సీబీఐ కేసు నమోదు - పొదుపు ఖాతాల సొమ్ము స్వాహా చేసిన అసిస్టెంట్​ మేనేజర్​

స్వయం సహాయక బృందాల ఖాతాల్లో సొమ్ము స్వాహాపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎస్​బీఐ బ్రాంచ్​ అసిస్టెంట్​ మేనేజర్​పై కేసు నమోదు చేసింది.

పొదుపు మహిళల ఖాతాల్లో సొమ్ము స్వాహా.. సీబీఐ కేసు నమోదు

author img

By

Published : Feb 23, 2021, 12:02 AM IST

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎస్​బీఐలో.... స్వయం సహాయక బృందాల ఖాతాల్లో సొమ్ము స్వాహాపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. సస్పెన్షన్​లో ఉన్న బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పి.రవిశంకర్​పై కేసు నమోదు చేసింది. దాదాపు రూ.3.10 కోట్లు... రవిశంకర్ తన ఖాతాల్లోకి మళ్లించినట్లు బ్యాంకు అంతర్గత విచారణలో తేలింది. తమ పొదుపు ఖాతాలోని రూ.5 లక్షలు కాజేసినట్లు అమ్మాపురం గ్రామానికి చెందిన సోని మహిళ పొదుపు సంఘం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

రుణాల పేరిట మోసాలు :

బ్యాంకు అంతర్గత విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. తొర్రూరులో అసిస్టెంట్​ మేనేజర్​గా పనిచేసిన రవిశంకర్​ 2016 నుంచి 2019 వరకు అక్రమాలకు పాల్పడినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. స్వయం సహాయక బృందాలు, కిసాన్ క్రెడిట్ కార్డుల పేరిట రుణాలు మంజూరు చేసి వారికి తెలియకుండా.. అతనితో సహా కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించినట్లు బ్యాంకు విచారణలో బహిర్గతమైంది. పొదుపు సంఘాలకు సహకరించేందుకు సెర్ప్ నియమించిన కొందరు రిసోర్సు పర్సన్లకు కూడా కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఎస్​బీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో 141 స్వయం సహాయక బృందాలు, 18 కిసాన్ క్రెడిట్ కార్డుల ఖాతాల్లో నిధులు కాజేసినట్లు తేలింది. ఎస్​బీఐ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : యువకునిపై కత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.