నిజమాబాద్ జిల్లా బోధన్ రాకాసిపేట్ శివారులో దారుణం చోటుచేసుకుంది. శివ, నర్సింలు అనే ఇద్దరు అన్నదమ్ములను వాళ్ల పెద్దనాన్న కుమారుడు వెంకట్ హతమార్చాడు. నిన్న మధ్యాహ్నం సమయంలో... మద్యం తాగుదామని చెప్పి బెల్లాల్ చెరువు దగ్గరికి శివ, నర్సింలును వెంకట్ తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి మద్యం తాగించాడు. అనంతరం.. తనతో మాట్లాడాలని చెప్పి శివను తీసుకెళ్లి చెరువులో తోసేశాడు. ప్రాణం పోయాక.. నర్సింలును కూడా ఇదే విధంగా చెరువులో తోసేశాడు. అటు నుంచి నేరుగా ఇంటికి వచ్చిన వెంకట్.. రాత్రి సమయంలో కుటుబ సభ్యులకు సమాచారం అందించాడు.
వారం రోజుల క్రితం వీళ్ల మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆ గొడవను మనసులో పెట్టుకునే ఈ హత్యను పాల్పడి ఉంటాడని... అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్నదమ్ములిద్దరి మృతదేహాలను చూసిన కుటుంబీకులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వెంకట్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి:
Murder: తప్పని చెప్పినందుకు... తల్లిని బండరాయితో కొట్టి చంపిన తనయుడు
MURDER: రియల్టర్ దారుణ హత్య... కారు డిక్కీలో వేసి కాల్చేశారు!