ETV Bharat / crime

బాల్కొండలో అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు.. - ద్విచక్రవాహనం చోరీ

అర్ధరాత్రి వేర్వేరు చోట్ల దుండగులు చోరీలకు యత్నించారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో యూనియన్‌ బ్యాంకు ఏటీఎంలో కొందరు చోరీకి విఫలయత్నం చేయగా.. మరో చోట దుకాణం ముందు ఉన్న ద్విచక్రవాహనాన్ని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. బైక్ అపహరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Bike and atm theft in
నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో చోరీలు
author img

By

Published : Jun 1, 2021, 6:23 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు. యూనియన్‌ బ్యాంకు ఏటీఎంలో చోరీకి కొందరు విఫలయత్నం చేశారు. ఇద్దరు దొంగలు ఏటీఎంలోని డబ్బులు దోచేందుకు యత్నించగా సాధ్యంకాకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఏటీఎం మిషన్‌కు ఎలాంటి నష్టం వాటిళ్లలేదని బ్యాంకు అధికారులు తెలిపారు.

బేకరి ముందు బైక్ ఎత్తుకెళ్లిన దుండగుడు

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలో చోరీలు

రాత్రి సమయంలోనే పట్టణంలోని వినాయక బేకరి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని ఓ దొంగ ఎత్తు కెళ్లాడు. చోరీకి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. దీంతో ద్విచక్రవాహన యజమాని బాల్కొండ పోలీసులకు పిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: Software Prashanth: ప్రేయసి కోసం పాక్​కి వెళ్లి.. నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.