ETV Bharat / crime

అమానవీయ ఘటన... చెత్తకుండీలో పసికందు - baby deadbody found

రాజేంద్రనగర్​లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాంబాగ్‌లోని చెత్తకుండీలో పసికందు మృతదేహం లభ్యమైంది. అప్పుడే పుట్టిన శిశువును చెత్తకుండీలో గుర్తుతెలియని వ్యక్తులు పడేశారు.

baby deadbody found in dustbin, Rajendranagar
అమానవీయ ఘటన... చెత్తకుండీలో పసికందు
author img

By

Published : Apr 5, 2022, 12:35 PM IST

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి రాంబాగ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చెత్త కుండీ వద్ద పసికందు మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని వ్యక్తులు.. అప్పుడే పుట్టిన శిశువు మృతదేహాన్ని... కూరగాయల చెత్త, కవర్లు, పేపర్లతో కలిపి ఒక మూటగా కట్టి చెత్త కుండీ వద్ద పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా... వారి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. శిశువు పుట్టగానే మరణించి ఉంటుందని తెలిపారు. శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇలాంటి అమానవీయ ఘటననే నిన్న నీలోఫర్ ఆస్పత్రి వద్ద జరిగింది. పది రోజుల వయస్సున్న పసికందును ప్లాస్టిక్‌ కవర్‌లో తీసుకొచ్చి పడేశారు. ఆటోలో వచ్చిన కొందరు కవర్‌ను ఆస్పత్రి వద్ద వదిలి వెళ్లినట్టు గుర్తించిన స్థానికులు వైద్యులకు సమచారం ఇచ్చారు. వెంటనే కవర్‌ తెరిచిన వైద్యులు..... అందులో పాపను గుర్తించి పరీక్షలు చేశారు. చిన్నారికి అంగ వైకల్యం సహా కామెర్లు ఉన్నట్టు గుర్తించి చికిత్స ప్రారంభించారు. చిన్నారికి అంగవైకల్యం, అనారోగ్యం ఉందనే వదిలి వెళ్లారా..? లేదా మరేదైనా కారణం ఉందా.... అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: హెడ్​మాస్టర్ పాడు బుద్ధి..​ వాట్సాప్​లో అసభ్య మెసేజ్​లు.. చంపేస్తానంటూ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.