ETV Bharat / crime

ATM Robbery Gang : ఏటీఎం దొంగల ముఠా అరెస్టు

ఏటీఎంల వద్దకు వచ్చిన అమాయకులే వీరి టార్గెట్. వారి అవసరాన్ని ఆసరా చేసుకుంటారు. ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయడం రాని వారికి సాయం చేస్తామని చెబుతారు. డబ్బు డ్రా చేసినట్టే చేసి.. ఏటీఎం కార్డును మార్చేస్తారు. ఆ తర్వాత డెబిట్ కార్డు నుంచి నగదు తీసుకుంటారు. ఇలా అమాయకులను మోసం చేస్తున్న ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు.

ఏటీఎం దొంగల ముఠా అరెస్టు
ఏటీఎం దొంగల ముఠా అరెస్టు
author img

By

Published : Jul 29, 2021, 11:06 AM IST

ఏటీఎంల వద్దకు వచ్చిన అమాయకులను ఆసరా చేసుకుని.. సాయం చేస్తామని ఏటీఎం కార్డులను మార్చి వరుస దోపిడీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ తరుణ్ జోషి నిందింతుల వివరాలను వెల్లడించారు.

వరంగల్ సీపీ తరుణ్ జోషి
వరంగల్ సీపీ తరుణ్ జోషి

నిరక్షరాస్యులే టార్గెట్..

" ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొమ్మ రాజు, కరటకం సాయికిరణ్, ఇల్లు వెంకట సాయి కిరణ్, కొప్పి శెట్టి రాజ్ కుమార్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏటీఎం సెంటర్ల వద్ద నిరక్షరాస్యులను టార్గెట్ చేస్తుంటారు. ఏటీఎం కార్డు ద్వారా నగదు డ్రా చేసిస్తామని నమ్మించి కార్డు మార్పిడి చేసి డబ్బులు రావడం లేదని చెబుతారు. అలా తీసుకున్న ఏటీఎం కార్డులతో వేరే ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేసుకొని జల్సాలకు పాల్పడతారు."

- తరుణ్ జోషి, వరంగల్ సీపీ

అందరు 30 ఏళ్లలోపు వారే..

తనకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా జరుపుతున్న విచారణలో ఈ దొంగల ముఠాను పట్టుకున్నారని సీపీ తెలిపారు. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలంలో, జనగామ పట్టణంలో, వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట, సూర్యాపేట, వనపర్తి, రంగారెడ్డి, కర్నూలు టౌన్, కడప టౌన్, చిత్తూరు వంటి తదితర ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయని, జనగామ నెహ్రూ పార్క్ వద్దగల ఏటీఎం వద్ద ఉన్నారనే పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితులంతా 30 సంవత్సరాల లోపు వారని చెప్పారు. కరోనా సమయంలో కష్టపడకుండా సుఖంగా డబ్బులు సంపాదించేందుకు ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని సీపీ పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై గతంలోనూ అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వివరించారు.

పరారీలో రాజ్​కుమార్

నిందితుల్లో కొప్పిశెట్టి రాజ్​కుమార్ పరారీలో ఉన్నాడని, పట్టుబడిన ముగ్గురిని రిమాండ్​కు తరలించినట్లు సీపీ తరుణ్ తెలిపారు. వీరి వద్ద నుంచి ఒక లక్షా 60 వేల రూపాయల నగదు, 8 డూప్లికేట్ ఎటీఎం కార్డ్లు, ఒక మారుతి బెలోనో కారు, ఒక మారుతి ఇగ్నిస్ కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏటీఎం దొంగల ముఠాను ఛేదించిన పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, జనగామ పోలీసు బృందాన్ని సీపీ అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.