Woman missing in sanathnagar: సనత్‌నగర్ రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా పని చేస్తున్న వాసవీ ప్రభ 48 రోజుల నుంచి కనిపించకుండా పోయింది. తమ కూతురు నవంబర్ 30 తేదీన తప్పిపోయినట్లు తల్లిదండ్రులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చాలాచోట్ల వెతికినా ఇంతవరకు ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. అంతకుముందే తల్లిదండ్రులు డిసెంబర్ 11 తేదీన సంచిత్ సాయి అనే వ్యక్తితో వాసవీ ప్రభకు వివాహం నిశ్చయించారు.
ఆమె మొబైల్ ఇంట్లోనే వదిలేసి పోవడంతో ఆచూకీ లభించలేదని చెబుతున్నారు. పెళ్లి చేసుకోబోయే సంచిత్ సాయితో వాసవి గొడవ పడినట్లు తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని, ఆమెకు నచ్చిన వారితోనే పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాసవి ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
"సనత్‌నగర్ రైల్వే స్టేషన్‌లో అసిస్టెంట్ లోకో పైలెట్‌గా పని చేస్తున్న వాసవీ ప్రభ (26) అమ్మాయి కనిపించకుండా పోయింది. నవంబర్ 30వ తేదీ నాడు ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెకు డిసెంబర్ 11తేదీన తల్లిదండ్రులు వివాహం నిశ్చయించారు. ఇంట్లోనే ఫోన్ వదిలేసి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆమెకు తెలిసిన వారిని, అనుమానితులను విచారించాము. ఎటువంటి సమాచారం లభించలేదు. ఈ అమ్మాయి గురించి ఎటువంటి ఆచూకీ సమాచారం తెలిసినా సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో తెలియజేయగలరు. వారికి బహుమతి ఇస్తాము". - ముత్తుయాదవ్, సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్
ఇవీ చదవండి: