ఐదుగురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన మహిళ నుంచి భూమి తీసుకుని... పరిహారం ఇవ్వకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఆదేశించినా చెల్లింపుల్లో జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం... ఐఏఎస్‌ల జీతాల నుంచి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్‌కు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు, ఇప్పటి ఐఏఎస్ ముత్యాలరాజుకు... వెయ్యి రూపాయల జరిమానా, 2 వారాల జైలుశిక్ష ఖరారు చేసింది.
మరో ఐఏఎస్ రావత్‌కు నెల రోజుల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజులు గడువిచ్చిన హైకోర్టు... నెల రోజుల పాటు శిక్షను సస్పెండ్ చేసింది.