యాదాద్రి జిల్లా భువనగిరి మండలం భస్వాపురం జలాశయంలో తన భూమికి పరిహారం ఇవ్వట్లేదని ఓ నిర్వాసితుడు వీరంగం సృష్టించాడు. భువనగిరి మండలం బి.ఎన్.తిమ్మాపూర్‌కి చెందిన పిన్నం సతీశ్‌కి 12 ఎకరాల భూమి ఉండగా.. అందులో తొమ్మిది ఎకరాల భూమి మరో వ్యక్తి పేరుతో నమోదైంది. దీంతో ఇటీవల ఇరువురి మధ్య ఏర్పడిన వివాదాన్ని గ్రామ పెద్దలు ఒప్పంద పత్రం రాయించి సమస్యను పరిష్కరించారు.
భూమిలో 75 శాతం పరిహారం సతీశ్‌కు అందించాల్సి ఉండగా.. గత మూడు నెలలుగా వెంటనే ఖాతాలో నగదు జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చి జమ చేయలేదు. విసిగిపోయిన బాధితుడు నిర్మాణ పనులను ఆపాలంటూ సొంత ఆటోపై డీజిల్ పోసి నిప్పంటించాడు. ఆటో కొంత దగ్దం కాగా... స్థానికులు విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. సదరు వ్యకిని నిలువరించారు. సాయంత్రం మరోమారు బాధితుడు వంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డటంతో స్థానికులు అతన్ని రక్షించారు.
ఇదీ చదవండి: సాగర్‌లో గెలుపే లక్ష్యం... ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం