Realtor murder case: హైదరాబాద్ తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన స్థిరాస్తి వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. వ్యాపారంలో విభేదాలే హత్యకు దారి తీసినట్లు పోలీసులు తేల్చారు. తన దగ్గర ఏజెంట్‌గా పనిచేసే నరేందర్‌రెడ్డే... విజయ్‌భాస్కర్‌ను కాల్చి చంపినట్టు దర్యాప్తులో తెలిసింది. ఇద్దరి మధ్య కమీషన్ విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ వల్లే.. నిందితుడు కక్ష పెంచుకుని హత్య చేసినట్టు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.
Real estate agent vs Realtor: స్థిరాస్థి వ్యాపారి విజయ్ భాస్కర్ ఇళ్ల స్థలాలు విక్రయిస్తుంటాడు. నరేందర్ రెడ్డి తన దగ్గర ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. విజయ్భాస్కర్రెడ్డికి నరేందర్‌రెడ్డి సమీప బంధువు కాగా.. ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు. ఇదే కాకా.. నరేందర్ క్యాబ్ డ్రైవర్‌గానూ పని చేస్తున్నాడు. నరేందర్ రెడ్డి సరిగా వ్యవహరించక పోవడం వల్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి తరచూ అవమానించేవాడు. ఓ స్థలం అమ్మగా.. కమీషన్ విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి విజయ్‌భాస్కర్‌పై కక్ష పెంచుకున్న.. నరేందర్ హతమార్చేందుకు కుట్ర పన్నాడు. అందుకు రూ.30 వేలతో రెండు నాటు తుపాకులు కొన్నాడు.
murder with local gun: నవంబర్ 29న ఓ ఇంటి స్థలం ఉందని.. విజయ్భాస్కర్రెడ్డికి నరేందర్‌రెడ్డి ఫోన్ చేశాడు. వెంటనే విజయ్‌భాస్కర్ తొమ్మిదిన్నర లక్షలు తీసుకొని ఇంటి నుంచి బయల్దేరాడు. మార్గ మధ్యలో నరేందర్‌రెడ్డి కారులో ఎక్కాడు. ఆ తర్వాత ఆర్టీసీ కాలనీ వైపు తీసుకెళ్లి.. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో కాల్చేశాడు. చనిపోయాడని నిర్ధరించుకున్న తర్వాత.. దాదాపు 5 గంటల పాటు మృతదేహాన్ని కారులోనే పెట్టుకొని పలుచోట్ల తిరిగాడు. విజయ్‌భాస్కర్ దగ్గరున్న తొమ్మిదిన్నర లక్షలను తీసుకున్నాడు. హత్యకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. మృతదేహాన్ని, కారును అక్కడే వదిలి పరారయ్యాడు. విజయ్‌భాస్కర్‌రెడ్డి చరవాణితో పాటు.. నాటు తుపాకీని కొంత దూరంలో పడేసి వెళ్లాడు.
police arrest an accused: విజయ్‌భాస్కర్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అదే రోజు రాత్రి 10.30 గంటలకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా ఆర్టీసీ కాలనీలో మృతదేహం కనిపించింది. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు.. సాంకేతికత ఆధారంగా నిందితుడు నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. నిందితుని దగ్గర్నుంచి రెండు తుపాకులు, నగదుతో పాటు.. చరవాణీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: