ETV Bharat / crime

కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ... రూ.1.97 కోట్లను కాజేసే యత్నం - తెలంగాణ వార్తలు

మంచిర్యాలలో జరిగిన సంతకాల ఫోర్జరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. జిల్లా కలెక్టర్‌, మైనింగ్‌ శాఖ ఏడీల సంతకాల ఫోర్జరీతో రూ.1.97 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించారు.

accused-arrested-in-mancherial-collector-signature-forgery-case
కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ... రూ.1.97 కోట్లను కాజేసే యత్నం
author img

By

Published : Apr 26, 2021, 7:22 AM IST

ఏకంగా జిలా కలెక్టర్‌, ఇతర అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి భారీ మొత్తంలో ప్రభుత్వ ధనాన్ని కాజేయడానికి యత్నించిన నిందితులను మంచిర్యాల పోలీసులు అరెస్టుచేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్‌ జిల్లా గనులు, భూగర్భశాఖలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా ఇసుక, పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది. అదే విభాగంలో ఉన్న శ్రీనివాస్‌ విధుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి ఏడీ రామావత్‌ బాలు పలుమార్లు హెచ్చరించారు. దీంతో తాను ఎప్పటికైనా ఈ ఉద్యోగానికి దూరమవుతానని భావించిన శ్రీనివాస్‌ పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.

పక్కాగా ప్రణాళిక...

ఇదే సమయంలో నూతన చెక్‌ పుస్తకాల కోసం జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారులు ఐసీఐసీఐ బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌ ఓ ఆన్‌లైన్‌ వస్తు విక్రయ సంస్థలో పనిచేస్తున్న తాళ్లపల్లి రాజుతో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించాడు. బ్యాంకుకు సంబంధించిన చెక్‌ పుస్తకాలు కొరియర్‌కు వస్తాయని తెలుసుకున్న రాజు కొరియర్‌ నిర్వాహకులతో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు. మార్చి 9, 2021న చెక్‌ పుస్తకాలు వచ్చాయని తెలుసుకున్న రాజు తాను గనులు, భూగర్భశాఖకు చెందిన కార్యాలయానికి వెళ్తున్నానని, తాను అందజేస్తానని కొరియర్‌ సంస్థ నుంచి ఆ పార్శిల్‌ను తీసుకున్నాడు. అందులో ఉన్న ఐదు పుస్తకాలలో ఒకటి తీసుకొని మిగతా వాటిని కార్యాలయంలో అందించాడు. పని ఒత్తిడిలో ఉన్న కార్యాలయ సిబ్బంది చెక్‌ పుస్తకాలలో ఒకటి తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తించలేదు. మహారాష్ట్ర చంద్రాపూర్‌లో ఉన్న రాజు స్నేహితురాలు లలితా పాయల్‌ బంకర్‌ వద్దకు వెళ్లి ఆమెతో యాక్సిస్‌ బ్యాంకులో ఖాతా తెరిపించిన నిందితులు, ఐసీఐసీఐ చెక్‌బుక్‌పై ఆమె సంతకాలు తీసుకొని మంచిర్యాలకు వచ్చారు. జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్లికేరి, ఏడీ రామావత్‌ బాలుల సంతకాలు, రబ్బరు స్టాంపులను ఫోర్జరీ చేసి లలితా పాయల్‌ బంకర్‌ పేరు మీద రూ.1,97,46,151 చెక్‌ను తయారుచేశారు. ఏప్రిల్‌ 16, 2021న అధికారులు ఇసుక ట్రాక్టరు యజమానులకు రూ.3.50 కోట్లకు సంబంధించిన మొత్తం ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌ అంగీకరించారని, 17న ఆ మొత్తం విడుదల అవుతుందని శ్రీనివాస్‌ తెలుసుకున్నాడు. అదే రోజున నిందితులు లలితా పాయల్‌ బంకర్‌ పేరు మీద ఉన్న చెక్‌ను కరీంనగర్‌లోని బ్యాంకులో డిపాజిట్‌ చేశారు.

అధికారులను అప్రమత్తం చేసి..

పెద్దమొత్తం కావడం, ఆపై వ్యక్తిగత ఖాతాకు చెక్‌ ఇవ్వడంతో బ్యాంకు అధికారులు అనుమానించారు. జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. వారు ఈనెల 22న మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తాళ్లపల్లి శ్రీనివాస్‌, తాళ్లపల్లి రాజు, మేడిపల్లి జీవన్‌లను అదుపులోకి తీసుకొని వారి నుంచి చెక్‌ పుస్తకాలు, ఫోర్జరీ చేసిన సంతకాల పత్రాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసంలో తమకు సహకరించిన జీవన్‌కు రూ.30 లక్షలు ఇచ్చేందుకు రాజు, శ్రీనివాస్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్సై కిరణ్‌, సిబ్బంది శ్రీనివాస్‌, బ్రహ్మచారి, తిరుపతి, వసంత్‌లకు ఏసీపీ రివార్డులు అందజేశారు. సమావేశంలో సీఐ ముత్తిలింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సంతకాల ఫోర్జరీ కేసులో నిందితుల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.