ACB Searches in Sub Registrar House: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై.. మల్కాజిగిరి సబ్ రిజిస్ట్రార్ పళనికుమారి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ శ్రీనివాస్ బృందం తనిఖీలు జరుపుతోంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పరిధిలోని వినాయకనగర్‌లో సోదాలు జరిపిన అనిశా అధికారులు.. కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఏకకాలంలో పళని బంధువుల ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. రాత్రి వరకూ తనిఖీలు జరిగే అవకాశముందని సమాచారం. సోదాలు పూర్తైన తర్వాతే ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.
ఇవీ చదవండి: