వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మన్నెగూడ సర్పంచ్ వినోద్గౌడ్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఓ కళాశాల వద్ద డబ్బులు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.
లేఅవుట్ అనుమతి కోసం సర్పంచ్ రూ.20 లక్షలు డిమాండ్ చేశారని... రూ.13 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.. కారు, ఆభరణాలు స్వాధీనం