మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడు.. సొంత పెద్దనాన్ననే కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు.
చెల్లెలికి చేతబడి చేశాడని..
జలాల్‌పురం తండాకు చెందిన నరసింహ.. ఇటీవల తన సోదరి అనారోగ్యానికి గురికాగా వైద్యం చేయిస్తున్నాడు. చెల్లెలి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో.. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అందుకు కారణం పెద్దనాన్న చేసిన చేతబడే అని భావించి పగ పెంచుకున్నాడు.
పెద్దమ్మ కళ్ల ఏదుటే..
సాయంత్రం సమయంలో నరసింహా.. పొలం వద్ద పనులు చేసుకుంటున్న కిషన్ వద్దకు వెళ్లాడు. పెద్దమ్మ కళ్ల ఏదుటే.. అతనిని కత్తితో పొడిచి చంపాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: దారుణం: భార్యను హతమార్చిన భర్త