జగిత్యాల కొత్త బస్టాండ్ సులభ్ కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తి సజీవ దహనం చేసుకోవడం కలకలం రేపింది. సులభ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి ఒంటిపై పెట్రోలు(PETROL) పోసుకొని ఆత్మహత్య(SUICIDE IN SULABH COMPLEX)కు పాల్పడ్డాడు.
శౌచాలయం నుంచి మంటలు రావడంతో గమనించిన సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకుడు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. మంటలు అదుపు చేసే సరికే బాధితుడు పూర్తిగా కాలిపోయాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Wing Sure: వింగ్ స్యూర్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం