ETV Bharat / crime

man stabs woman in jagtial: కుమార్తెను వేధిస్తున్నాడని.. అల్లుడి తల్లిను చంపిన తండ్రి - తెలంగాణ వార్తలు

A man stabs woman in jagtial, a man stabbed Son-in-law mother
అల్లుడి తల్లిపై కత్తితో దాడి
author img

By

Published : Dec 13, 2021, 4:38 PM IST

Updated : Dec 13, 2021, 6:53 PM IST

16:31 December 13

man stabs woman in jagtial: కుమార్తెను వేధిస్తున్నాడని.. అల్లుడి తల్లిను చంపిన తండ్రి

A man stabs woman in jagtial, a man stabbed Son-in-law mother
అల్లుడి తల్లిపై కత్తితో దాడి

A man stabs woman in jagtial : జగిత్యాల బీట్ బజార్‌లో దారుణం జరిగింది. కుమార్తెను వేధిస్తున్నాడనే కోపంతో అల్లుడి తల్లిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తన కూతురిని వేధిస్తున్నాడని అల్లుడి ఇంటికి కత్తితో వచ్చాడు మహేశ్ అనే వ్యక్తి. ఆ సమయంలో అల్లుడు దొరకకుండా పారిపోవడం వల్ల అతడి తల్లిపై కత్తితో దాడికి దిగాడు. ఈ దాడిలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

ఏం జరిగింది?

జగిత్యాల బీట్ బజార్‌కు చెందిన కిరణ్-గంగా భవాని మధ్య కుటుంబకలహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కాపురానికి రావడం లేదు. దీనిపై కోర్టులో కేసు నడుస్తోందని స్థానికులు చెప్పారు. అల్లుడి తీరుపై పగ పెంచుకున్న మామ మహేశ్... కత్తి తీసుకొని కిరణ్ ఇంటికి వచ్చాడు.

బాధితురాలి పరిస్థితి విషమం

మామ మహేశ్ కత్తి తీసుకొని వచ్చిన సమయంలో కిరణ్ ఇంట్లో నుంచి పారిపోయాడు. ఇంట్లోనే ఉన్న కిరణ్ తల్లి యమునతో మహేశ్ వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరిగి ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన యమునను ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం విషమించి.. ఆమె మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: RTC Bus Accident Chinthakani : ఇసుక లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

Last Updated : Dec 13, 2021, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.