గత నెల హైదరాబాద్ బహదూర్‌పురా ఠాణా పరిధిలో జరిగిన ఐజాజ్ అనే రౌడీషీటర్ హత్య కేసులో పరారీలో ఉన్న గఫర్ని అరెస్ట్ చేశారు. మెత్తం ఈ హత్య కేసులోని ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలిచినట్లు దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్ తెలిపారు.
హత్య చేస్తాడని హత్య..
బహదూర్‌పురాకు చెందిన మహ్మద్ ఐజాజ్ 2020లో అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ గఫార్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు కోర్టులో ఉండగా తనకు వ్యతిరేంగా కోర్టులో సాక్ష్యం చెప్పవద్దని, ఆ కేసును వాపసు తీసుకోవాలని అబ్దుల్ గఫార్‌పై రౌడీషీటర్ ఐజాజ్ ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఎక్కడ తనను హత్య చేస్తాడోనన్న భయంతో అబ్దుల్ గఫార్ తన తండ్రి మహ్మద్ అబ్దుల్ రఫితో పాటు బంధువులు కలిసి గత నెల20న కిషన్ భాగ్ ప్రాంతంలో హత్యకు పథకం వేశారు.
ఐజాజ్ కళ్లలో కారం కలిపిన నీళ్లను చల్లారు. అనంతరం కత్తులు కర్రలతో తీవ్రంగా దాడి చేశారు. గ్రానైట్ రాయితో తలపై మోదారు. దీంతో ఐజాజ్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి మొదట ఐదుగురు నిందితులను ఆరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా... పరారీలో ఉన్న గఫర్ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించినట్లు డీసీపీ గజరావ్ భూపాల్ తెలిపారు.
ఇదీ చూడండి: పెళ్లామే కావాలన్న పదహారేళ్ల బాలుడు