ETV Bharat / crime

ఆస్తి పంచడం లేదని ఓ కోడలు ఎంతకి తెగించిందంటే.. - తెలంగాణ నేర వార్తలు

ఏ అత్తమామలైనా తమ ఇంటికి వచ్చే కోడలు మహాలక్ష్మిలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటారు. మలిదశలో తమని బిడ్డల్లా చూసుకునే కోడలికి తమ ఇంటిని చక్కదిద్దే బాధ్యతను అప్పగిస్తారు. అత్తమామలను దైవంగా భావించే వారి గురించి పురాణాల నుంచి కథలుకథలుగా చదువుతూనే ఉన్నాం. కానీ అమ్మానాన్న లాంటి అత్తమామలను మోసం చేసి.. అన్నం పెట్టే ఇంటికే కన్నం వేసిన కోడలి కథ తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Froud daughter in law
Froud daughter in law
author img

By

Published : Oct 19, 2021, 4:44 AM IST

అత్తమామలు ఆస్తి పంచడంలేదని సొంత ఇంటికే కన్నం వేసింది ఓ కోడలు. సాంకేతికత వాడుకొని సులభంగా పని పూర్తి చేసింది. పోలీసులకు ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. కరీంనగర్‌లో నివాసముంటున్న వైకుంఠానికి నలుగురు కుమారులున్నారు. తనవద్ద ఇద్దరు కుమారులు, కోడళ్లు ఉండగా ... మరో ఇద్దరు కుమారులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కరీంనగర్‌లో ఉమ్మడి కుటుంబంలో ఉండలేమని కోడలు కొద్దినెలలుగా తరచూ అత్తమామలతో గొడవపడుతుండేది. తమ తదనంతరం ఆస్తిపంచుకోవాలని అత్తమామలు తెగేసి చెప్పడంతో అసంతృప్తితో సంసార బాధ్యతలు నిర్వహిస్తోంది. సూటిపోటి మాటలతో వృద్ధులను వేధిస్తుండేది.

పక్కా స్కెచ్​ వేసి..

అత్తమామల వద్ద ఉన్న ఆభరణాలు కాజేయాలని పథకం వేసింది. 3నెలల క్రితం మామ ఫోన్‌లో ఆటోమేటిక్‌ కాల్‌ రికార్డింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసి... తన గూగుల్ డ్రైవ్‌కు అనుసంధానం చేసింది. అప్పటి నుంచి ఫోన్‌లో మాట్లాడిన మాటలన్నీ వినడం ప్రారంభించింది. దసరాకు కొడుకు పిలిచాడని బేగంపేటలో ఉన్న కొడుకు రావాలని కోరడంతో వృద్ధ దంపతులు హైదరాబాద్ వచ్చారు. వచ్చేటప్పుడు బీరువా, అల్మారా, దేవుడి గది తాళాలు తీసుకురావద్దని, ఇంట్లోనే భద్రపరిచి రావాలంటూ కుమారుడు చెప్పాడు. దీంతో వైకుంఠం తాళాలను ఎక్కడా ఉంచింది కొడుకుకు వివరంగా చెప్పాడు.

టెక్నాలజీ ఉపయోగించుకునిమరీ కొట్టేసింది..

వీటిని విన్న కోడలు అత్తమామలు హైదరాబాద్‌కు చేరుకున్నారని తెలుసుకున్న వెంటనే ఆ తాళాలను తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా విలువైన వస్తువులు, పత్రాలను తీసుకుంది. వైకుంఠం ఇంటికి వచ్చి బీరువా, అల్మారాలను పరిశీలించగా .. వస్తువులు కనిపించలేదు. కోడలిని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదంటూ చెప్పింది. వైకుంఠం కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రేమకు అడ్డొస్తోందని ప్రియుడితో కలిసి తల్లిని చంపిన కుమార్తె

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.