ETV Bharat / crime

Case On Actor Naresh Wife : నటుడు నరేశ్​ భార్య రమ్య రఘుపతిపై చీటింగ్​ ఆరోపణలు - నటుడు నరేశ్​ ఆస్తులు చూపించి డబ్బులు వసూలు చేసిన రమ్య

Case On Actor Naresh Wife : సీనియర్​ నటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్​ భార్య.. రమ్య రఘుపతిపై పలువురు మహిళలు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. అధిక డబ్బులు ఇప్పిస్తామని ఆశచూపి పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Ramya Scam
Ramya Scam
author img

By

Published : Feb 22, 2022, 5:16 PM IST

Updated : Feb 22, 2022, 8:04 PM IST

Case On Actor Naresh Wife : టాలీవుడ్​ సీనియర్​ నటుడు నరేశ్​ భార్య.. రమ్య రఘుపతిపై గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. నరేశ్​ కుటుంబ ఆస్తులను చూపి.. పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆమెపై పలువురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ వద్ద నుంచి సుమారు రూ.50లక్షలు మోసం చేసినట్లు ఆరోపించారు.

నగదు ఆరోపణలపై స్పందించిన నరేశ్​.. డబ్బు విషయంలో తనకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు. హీరో నరేశ్​కు రమ్య రఘుపతితో 8ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొన్నేళ్లుగా వేరువేరుగా ఉంటున్నారు.

నటుడు నరేశ్​ భార్య రమ్య రఘుపతిపై చీటింగ్​ ఆరోపణలు

ఇదీ జరిగింది...

'నటుడు నరేశ్​ భార్య రమ్య రఘుపతిపై మూడురోజుల క్రితం గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​లో ఐదుగురు వేరువేరుగా ఫిర్యాదు చేశారు. 2019లో రమ్య రఘుపతి మధ్యవర్తుల ద్వారా వారికి పరిచయమై.. లోన్​ అగ్రిమెంట్​ కింద 20 శాతం వడ్డీతో చెల్లిస్తానని చెప్పి వారి నుంచి డబ్బులు తీసుకున్నారు. వారి వద్ద డబ్బులు లేకపోతే వారి పేరుపై వ్యక్తిగత రుణాలు తీసుకుని ఆ మొత్తాన్ని తీసుకున్నారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్​ అగ్రిమెంట్​గా తీసుకున్నారు. అలా తీసుకున్న మొత్తంలో ఇప్పటి వరకు సుమారుగా 50శాతం వరకు వడ్డీతో చెల్లించారు. మిగితా మొత్తానికి సంబంధించి చెక్కులు ఇవ్వగా.. అవి బౌన్స్​ కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మొత్తం రూ.41లక్షలు బాకీ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి ఫిర్యాదుపై దర్యాప్తు చేపడుతున్నాం.' -సురేశ్​, గచ్చిబౌలి సీఐ

ఇదీ చూడండి : ఎలక్ట్రిక్‌ బస్సుకు ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలు.. దగ్ధం

Last Updated : Feb 22, 2022, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.