ETV Bharat / crime

బ్యూటీషియన్​ ముసుగులో దందా.. ఫ్రిడ్జ్​లో దొరికిన సాక్ష్యం.. - women smuggling ganja

బ్యూటీషియన్ ముసుగులో ఓ మహిళ చేస్తున్న దందా వెలుగు చూసింది. తనిఖీలకు వచ్చి పోలీసులకు దొరకకుండా అంతా బాగానే మేనేజ్​ చేసినా.. చివరికి ఫ్రిడ్జ్​ డోర్​ తీయగానే అసలు నిజం బయటపడిపోయింది. అదేంటంటే..?

Marijuana Seized in Gudlavalleru
Marijuana Seized in Gudlavalleru
author img

By

Published : Feb 18, 2022, 3:17 PM IST

Updated : Feb 18, 2022, 3:58 PM IST

పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా గంజాయి స్మగ్లర్లు రకరకాల దారులు ఎంచుకుని దందా నడిపిస్తున్నారు. పోలీసుల వరకు కాదు.. కనీసం పక్కింటివాళ్లకు కూడా తెలియకుండా చాప కింద నీళ్లలా దందా సాగిస్తున్నారు. దందా చేస్తుంది వీళ్లేనని సమాచారం వచ్చినా.. వాళ్లు కాదేమో అని ఆలోచించేలా నమ్మిస్తున్నారు. తీరా అసలు విషయం తెలిసాకా.. నిందితులను చూసి పోలీసులే నివ్వెరపోతున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఏపీలోని కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో గంజాయి దందా వెలుగు చూసింది.

ఫ్రిడ్జ్​ డోరు తీస్తే గానీ..

బ్యూటీషియన్​ ముసుగులో ఓ మహిళ గంజాయి వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అది నిజమా కాదా..? అన్న అనుమానంతోనే పోలీసులు తనిఖీలు చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. మొత్తం తనిఖీ చేసినా ఏమీ దొరకలేదు. తమకు వచ్చిన సమాచారం తప్పేమో అని నిర్ధరణకు వచ్చే సమయంలోనే.. అసలు నిజం బయటపడింది. వంటింట్లోని ఫ్రిడ్జ్​ డోరు తీస్తే గానీ.. వాళ్ల దందాకు సాక్ష్యం దొరకలేదు మరి.

సహజీవనం చేస్తున్న ప్రియుడే..

గుడ్లవల్లేరు సంత రోడ్డులో బ్యూటీషియన్ హాలీ మున్నీసా బేగం నివాసముంటోంది. భర్తతో విడిపోయిన బ్యూటీషియన్.. కొంతకాలంగా సాధిక్​తో సహజీవనం చేస్తోంది. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా అంతా బాగానే నడుస్తోన్న సమయంలో.. గంజాయి కేసులో పోలీసులకు సాధిక్​ దొరికిపోయాడు. సాధిక్​ను అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా.. సాధిక్​ తమ దందా వివరాలు బయటపెట్టాడు. సాధిక్ తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు బ్యూటీషియన్ హాలిమున్నీసా బేగం ఇంట్లో తనిఖీలు చేశారు. సోదాల్లో భాగంగా ఫ్రిడ్జ్​లో చూడగా.. 550 గ్రాముల గంజాయి లభ్యమైంది. దొరికిన గంజాయిని స్వాధీనం చేసుకుని.. సదరు బ్యూటీషియన్​ను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 18, 2022, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.