నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మరమ్మతు కోసం.. రహదారి పక్కన నిలిపారు. ఆగి ఉన్న బస్సును నిర్మల్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు... అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీనితో నిజామాబాద్ డిపోకు చెందిన బస్సులో సుమారు 44 మంది ప్రయాణిస్తుండగా.. 30 మందికి గాయాలయ్యాయి. అందులో 8 మందికి తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెెలిపారు.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం చేయిస్తున్నామని నిజామాబాద్ రూరల్ సీఐ తెలిపారు. ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా నడిపి... ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.
ఇవీ చూడండి:
రేప్ కేసు దోషికి 15 రోజుల పెరోల్.. భార్యను గర్భవతిని చేసేందుకే!
కొనసాగుతున్న గ్రూప్-1 పరీక్ష.. వారికి నో ఎంట్రీ.. వెనుదిరిగిన అభ్యర్థులు