ETV Bharat / crime

మహిళపై దాడి.. చికిత్స పొందుతూ మృతి.. అదే కారణమా..? - woman murder in porumamilla

Kadapa Crime News: కడప జిల్లా పోరుమామిళ్లలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఓ మహిళపై దారుణంగా దాడిచేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.

kadapa crime news
kadapa crime news
author img

By

Published : Mar 30, 2022, 12:44 AM IST

Kadapa Crime News: ఏపీలోని కడప జిల్లా పోరుమామిళ్లలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నెపంతో షేక్​మున్నీ అనే మహిళపై కొంతమంది కర్రలతో దాడి చేశారు. సోమవారం రాత్రి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కడప రిమ్స్​కి తరలించగా.. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందింది. ఘటనపై కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కేసునమోదు చేసిన పోరుమామిళ్ల పోలీసులు.. 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. మున్నీ హత్య ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నట్టు సమాచారం.

అదే కారణమా..?: ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన షేక్​మున్నీ.. గత ఏడాదిగా పోరుమామిళ్లలోని ఓ సూపర్ మార్కెట్​లో పనిచేస్తోంది. పని నిమిత్తం పోరుమామిళ్లకు వచ్చి వెళ్లేది. అయితే ఆమె పనిచేసే సూపర్ మార్కెట్​కు ముగ్గురు యజమానులు ఉన్నారు. వారిలో ఒకరితో మున్నీ వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో అతని కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి షేక్​మున్నీపై దాడికి పాల్పడ్డారు. మున్నీని గిద్దలూరు నుంచి ఓ వాహనంలో కొట్టుకుంటూ తీసుకొచ్చి కడప రిమ్స్​లో చేర్చారు.

పోలీసుల అదుపులో 15 మంది: రిమ్స్​లో చికిత్స పొందుతూ.. మున్నీ చనిపోయింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోరుమామిళ్ల పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో 15 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సదరు మహిళ ఒంటరిగా నివసిస్తుందని పోలీసులు చెబుతున్నారు. వివాహేత సంబంధమే కారణమా అన్న కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: భార్య చికెన్​ వండలేదని భర్త ఆత్మహత్య..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.