ETV Bharat / city

కరోనాపై అధ్యయనానికి వరంగల్​ నిట్ ప్రొఫెసర్ ఎంపిక - warangal nit professor selected for research on corona

కరోనా వైరస్​పై అధ్యయనానికి కేంద్ర బయోటెక్నాలజీ విభాగం నుంచి రూ.2 కోట్ల పరిశోధనా ప్రాజెక్టు వరంగల్​ నిట్ ఆచార్యునికి లభించింది. ఈ ప్రాజెక్టు కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్​గా నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెరుగు శ్యామ్ వ్యవహరించనున్నారు.

professor
professor
author img

By

Published : May 21, 2020, 11:58 AM IST

కొవిడ్ -19 వైరస్​పై అధ్యయనానికి కేంద్ర బయోటెక్నాలజీ విభాగం నుంచి రూ. 2 కోట్ల పరిశోధనా ప్రాజెక్టు వరంగల్ నిట్ ఆచార్యునికి లభించింది. ఈ ప్రాజెక్టులో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్​గా హరియాణాలోని టీహెచ్ఎస్టీఐ సంస్థకు చెందిన డాక్టర్ గిరీశ్, కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్​గా వరంగల్ నిట్ బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ పెరుగు శ్యామ్ వ్యవహరించనున్నారు.

కరోనా వైరస్ స్థితిగతి ప్రస్తుతం - భవిష్యత్తు అనే అంశంపై ఎన్ఐఏబి, టీహెచ్ఎస్టీఐ సంస్థలతో కలిసి పరిశోదన చేయనున్నట్లు తెలిసింది. క్యాన్సర్, ఎయిడ్స్, మలేరియా తదితర వ్యాధుల నియంత్రణకు వినియోగించిన ఔషధాల్లో వంద రకాల నమూనాల పై విశ్లేషించనున్నారు.

కరోనా వైరస్ స్థితిని తెలుసుకునేందుకు ఐదు రకాల మాలిక్యుల్స్ ఉపయోగపడతాయని అంతర్జాతీయ వైరాలజీ సంస్థకు పరిశోధనా పత్రాన్ని పంపగా ప్రాజెక్టుకు ఆమోదం లభించిందని అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.