ప్రకృతిని ఆరాధించే సంస్కృతి తెలంగాణ ప్రజలదని వరంగల్ మేయర్ డా.గుండా ప్రకాశరావు అబిప్రాయపడ్డారు. గ్రేటర్ వరంగల్ 33వ డివిజన్ పరిధి మడికొండ మెట్టుగుట్ట ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మతల్లి విగ్రహాన్ని మేయర్, వర్ధన్నపేట శాసనసభ్యులు రమేశ్‌తో కలిసి ఆవిష్కరించారు.
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా పూలతో బతుకమ్మలను పేర్చి ఆరాధించే సంస్కృతి మనదని మేయర్ కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మ పండుగకు ప్రత్యేక గుర్తింపు దక్కిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పండుగా సందర్భంగా రూ.300 కోట్ల వ్యయం తో ఆడపడుచులకు చీరలను కానుకగా అందజేసిందని... అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొన్నారు.