నాలాలపైనున్న అక్రమ కట్టడాల తొలగింపులో వేగాన్ని పెంచాలని మహా నగరపాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి.. అధికారులను ఆదేశించారు. హన్మకొండలోని క్యాంప్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ , ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. బల్దియా ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు నమన్వయంతో వ్యవహరించాలని.. ఆక్రమణల తొలగింపు లక్ష్యాలను దసరా లోగా పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. ఇప్పటి వరకు 158 ఆక్రమణలు తొలగించినట్లు అధికారులు కమిషనర్‌కు తెలిపారు. తక్షణమే హైదరాబాద్ నుంచి పెద్ద యంత్రాలను రప్పించాలని అధికారులను ఆదేశించారు.
సకాలంలో లక్ష్యాలను పూర్తిచేయాలని లేనిపక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీచూడండి: చెత్త సేకరించేందుకు.. ప్రజలు సహకరించాలి : వరంగల్ కమిషనర్