ETV Bharat / city

నీటి ముంపు ప్రాంతాల్లో నేడు కేటీఆర్, ఈటల పర్యటన - వరంగల్​లో వరదలు

భారీ వర్షాలకు అతలాకుతలమైన వరంగల్‌లో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ నేడు పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు... వరంగల్‌లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించనున్నారు. వరదలు, కరోనా పరిస్థితిపై సమావేశం కానున్నారు.

ministers-ktr-and-etela-rajender-visit-floods-area-in-warangal
నీటి ముంపు ప్రాంతాల్లో నేడు కేటీఆర్, ఈటల పర్యటన
author img

By

Published : Aug 18, 2020, 7:20 AM IST

నీటి ముంపు ప్రాంతాల్లో నేడు కేటీఆర్, ఈటల పర్యటన

ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు... వరంగల్‌ జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానలు కొద్దిగా తగ్గినా.. వాగులు, వంకల ఉద్ధృతి తగ్గనేలేదు. ఇంకా పలు కాలనీలు జలదిగ్భందనంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద నష్టం పరిశీలనకు మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో మంత్రి కేటీఆర్ వరంగల్​లో పర్యటించనున్నారు.

ఇళ్లకే పరిమితమయ్యారు..

నాలుగు రోజులు కురిసిన వర్షానికి... నగరం ఏరులా మారిపోయింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మురికివాడలు, శివారు ప్రాంత కాలనీ వాసుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. వరదలు, పంట నష్టం తదితర అంశాలపై మంత్రులు ఎర్రబెల్లి దయకర్ రావు, సత్యవతి రాఠోడ్, సమీక్షించారు. గోదావరి ఉద్ధృతి కాస్త తగ్గడంతో.. ములుగు, భూపాలపల్లి జిల్లాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ముంపు గ్రామాలను గుర్తించిన అధికారులు... సుమారు 6వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఉద్ధృతి తగ్గలేదు...

మహబూబాబాద్ జిల్లాలో వాగులు... వంకల ఉద్ధృతి తగ్గలేదు. చెరువులు అలుగులు దాటి ప్రవహిస్తున్నాయి. వర్షాల ధాటికి వేమునూరులో రెండు ఇళ్లు... బయ్యారంలో ఓ ఇళ్లు కూలిపోయాయి. కొత్తపల్లి, బర్కపల్లె వాగులను కలెక్టర్‌ గౌతమ్ పరిశీలించారు. జనగామ జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. తరిగొప్పుల మండలంలోని పోతారం నుంచి సూల్‌పురం వెళ్లే రహదారి దెబ్బతింది. జిల్లాలో ఏడు రహదారులు నీటి ప్రవాహానికి మునిగిపోగా... ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: ఎరువులు డిమాండ్​కు తగినట్లు అందుబాటులో ఉండాలి : సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.