మాజీ మంత్రి కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో స్వతంత్ర సమరయోధులు పాశికంటి వీరస్వామి భార్య పాశికంటి లక్ష్మి మృతి చెందారు. విషయం తెలుసుకున్న కొండా సురేఖ వీరస్మామి కుటుంబాన్ని పరామర్శించారు. అంతకు ముందుగా లేబర్ కాలనీ మృతి చెందిన కాంగ్రెస్ నేత సదానందం కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని.. తమ నాయకులను, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కొండా సురేఖ హామీ ఇచ్చారు.
కొంత కాలంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుమరుగవుతున్న నేపథ్యంలో కొండా సురేఖ పర్యటన రూపంలో హస్తం నేతల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది.
ఇవీ చూడండి: 'ఆ నిర్ణయమే అమలైతే.. రాష్ట్రం రాష్ట్రంలా ఉండదు'